Prabhu deva: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుదేవా..! 1 y ago
తిరుమల శ్రీవారిని ప్రముఖ కొరియోగ్రాఫర్, సినీ నటుడు ప్రభుదేవా దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ప్రభుదేవాకు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.